డీఎస్పీని బలిగొన్న కరోనా..

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ బారినుంచి తెలంగాణ ప్రజలను రక్షించే క్రమంలో భాగంగా కరోనా వారియర్లు ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారు. కొందరు చికిత్స అనంతరం ఆరోగ్యంగా తిరిగి విధుల్లో చేరుతుండగా.. మరికొందరు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా కరోనా బారిన పడిన ఏఆర్ డీఎస్పీ శశిధర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గత [&hellip;]</p>

డీఎస్పీని బలిగొన్న కరోనా..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ బారినుంచి తెలంగాణ ప్రజలను రక్షించే క్రమంలో భాగంగా కరోనా వారియర్లు ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారు. కొందరు చికిత్స అనంతరం ఆరోగ్యంగా తిరిగి విధుల్లో చేరుతుండగా.. మరికొందరు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

విధి నిర్వహణలో భాగంగా కరోనా బారిన పడిన ఏఆర్ డీఎస్పీ శశిధర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి ఈరోజు మృతిచెందారు. ఆయన మృతి గురించి తెలియగానే పోలీసు శాఖ దిగ్భాంత్రికి గురైంది.ఇటీవలే విధి నిర్వహణలో కరోనా వారియర్స్ తగు జాగ్రత్తలు వహించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించిన విషయం తెలిసిందే.

Next Story