‘క్రాక్’ మాస్ ఐటెం అప్సర రాణి

by  |
‘క్రాక్’ మాస్ ఐటెం అప్సర రాణి
X

దిశ, వెబ్ డెస్క్: రామ్‌గోపాల్‌వర్మ థ్రిల్లర్ సినిమా హీరోయిన్ అప్సరా రాణి.. వర్మ డైరెక్షన్‌లోనే లెస్బియన్ మూవీ ‘డేంజరస్’ చేస్తుంది. ఒడిశాకు చెందిన ఈ అందాల భామ అందాల ఆరబోత లాక్‌డౌన్‌లో స్టార్ట్ కాగా, అప్పుడే మరో హాట్ చాన్స్ కొట్టేసింది. మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో ఐటెం గర్ల్‌గా ఆడియన్స్‌కు అందాల విందు చేసేందుకు రెడీ అవుతుంది.

ఇప్పటికే క్రాక్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా, ప్రజెంట్ ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ జరుగుతుంది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేస్తున్న ఈ సాంగ్ షూట్ నుంచి పిక్ షేర్ చేశాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. రవితేజ, జానీ మాస్టర్, గోపీచంద్‌‌తో కూడిన క్రాక్ పిక్‌కు లైక్స్ కొడుతున్న ఫ్యాన్స్..లోడ్ అవుతున్న సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. అతి త్వరలో మాస్ ఐటెం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్సర రాణి..ఈ ఐటెం సాంగ్‌తో టాలీవుడ్‌లో బిజీ అవుతుందేమో చూడాలి అని కొందరు అంటుంటే.. ఎవరు చాన్స్‌లు ఇవ్వకపోతే ఆర్జీవీ ఉన్నాడుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed