- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆపిల్‌ను రుచి చూసిన కేసీఆర్
<p>దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో తొలిసారిగా పండించిన ఆపిల్ పండ్లను సీఎం కేసీఆర్ టేస్ట్ చేశారు. ఆపిల్ పండ్ల తోటను సాగు చేసిన కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా రైతు కేంద్రె బాలాజీ సీఎం కేసీఆర్‌ను మంగళవారం ప్రగతి భవన్‌లో కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌కి రైతు బాలాజీ ఆపిల్ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు బాలాజీని కేసీఆర్ అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం […]</p>

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో తొలిసారిగా పండించిన ఆపిల్ పండ్లను సీఎం కేసీఆర్ టేస్ట్ చేశారు. ఆపిల్ పండ్ల తోటను సాగు చేసిన కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా రైతు కేంద్రె బాలాజీ సీఎం కేసీఆర్‌ను మంగళవారం ప్రగతి భవన్‌లో కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌కి రైతు బాలాజీ ఆపిల్ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు బాలాజీని కేసీఆర్ అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగు చేస్తున్నట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ ఆపిల్ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు రైతు తెలిపారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఓ ఉదాహరణ అని రైతు బాలాజీ అన్నారు.






