- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్ ప్లాంట్ అమ్మకం చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం
by Ramesh Goud |
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇండియాలోనే అతిపెద్ద స్కాం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కు అమ్మకం భలే మంచి చౌక బేరమని అన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని కేవలం 32,022 వేల కోట్ల రూపాయలకు ఏ విధంగా అమ్ముతారని తులసిరెడ్డి ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంలో దాదాపు లక్షా 68 వేల కోట్ల రూపాయలు అవినీతి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇండియాలోనే అతిపెద్ద స్కాం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. విశాఖ ఉక్కు అమ్మకం భలే మంచి చౌక బేరమని అన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని కేవలం 32,022 వేల కోట్ల రూపాయలకు ఏ విధంగా అమ్ముతారని తులసిరెడ్డి ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంలో దాదాపు లక్షా 68 వేల కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. బోఫోర్స్ విషయంలో కేవలం 64 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు మాత్రమే వచ్చాయని.. స్టీల్ ప్లాంట్ అమ్మకంలో మాత్రం లక్షా 68 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తులసిరెడ్డి ఆరోపించారు.
Next Story






