- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా: మంత్రి
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో పదో పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్ష తేదీలు ప్రకటించిన తరువాత వాయిదా వేయడం ఇది మూడోసారి. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలాగైనా నిర్వహిస్తామని సీఎం ప్రకటించినప్పటికీ..పరిస్థితుల తీవ్రత దృష్ట్యా మరోసారి వాయిదా వేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు కరోనా బాధితులుగా తేలారని, దీనిని మొగ్గలోనే తుంచాలంటే లాక్‌డౌన్ పాటించాలని అన్నారు. అందుకే పదో తరగతి […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో పదో పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్ష తేదీలు ప్రకటించిన తరువాత వాయిదా వేయడం ఇది మూడోసారి. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలాగైనా నిర్వహిస్తామని సీఎం ప్రకటించినప్పటికీ..పరిస్థితుల తీవ్రత దృష్ట్యా మరోసారి వాయిదా వేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు కరోనా బాధితులుగా తేలారని, దీనిని మొగ్గలోనే తుంచాలంటే లాక్‌డౌన్ పాటించాలని అన్నారు. అందుకే పదో తరగతి పరీక్షలు మరో రెండు వారాలు వాయిదా వేస్తున్నామని ఆయన ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు నిర్ణయించేది, మార్చి 31 తరువాత వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
Tags: 10 exams, corona virus, amaravathi,
Next Story






