- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల ఆకలిని బీజేపీ వ్యాపారం చేస్తోంది: శైలజానాథ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని మోడీ, సీఎం జగన్ కూడబలుక్కొని రైతులను మోసం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వినాశకర వ్యవసాయ చట్టాలకు రాష్ర్టంలోని వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా గాంధేయ మార్గంలో రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే ప్రజల ఆకలిని వ్యాపారం చేసే ప్రక్రియ బీజేపీ చేస్తోందని శైలజానాథ్ దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ దేశాన్ని అదానీ లాంటి వారికి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని మోడీ, సీఎం జగన్ కూడబలుక్కొని రైతులను మోసం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన వినాశకర వ్యవసాయ చట్టాలకు రాష్ర్టంలోని వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా గాంధేయ మార్గంలో రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే ప్రజల ఆకలిని వ్యాపారం చేసే ప్రక్రియ బీజేపీ చేస్తోందని శైలజానాథ్ దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ దేశాన్ని అదానీ లాంటి వారికి అమ్మేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ చట్టాలను సమర్థించే వారు, బీజేపీ తాబేదార్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారని, వ్యవసాయ చట్టాలను భేషరుతుగా వెనక్కి తీసుకోవాలని శైలజానాధ్ డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం గవర్నర్‌ను కలుస్తామని శైలజానాధ్ తెలిపారు.
Next Story






