పాలల్లో మనమే బెస్ట్!

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-02-19 05:20:16  IST  )

<p>రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల దిగుబడిలో నెంబర్ వన్‌గా నిలిచి శభాష్ అనిపించుకుంది. అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత గత ఐదేళ్లలో పాల దిగుబడిలో 55 శాతం వృద్ధి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగంలో సుదీర్ఘ కాలంగా పేరొందిన ఏపీ ఇప్పుడు డెయిరీ ఉత్పత్తిలో కూడా తన ఘనతను చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ అనగానే కోనసీమ అందాలు కళ్ల ముందు కదలాడుతాయి. పచ్చటి పచ్చిక బయళ్లు, పసుపుపచ్చని చీర చుట్టుకుందా? అన్నట్టుండే పంటపోలాలతో [&hellip;]</p>

పాలల్లో మనమే బెస్ట్!
X

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల దిగుబడిలో నెంబర్ వన్‌గా నిలిచి శభాష్ అనిపించుకుంది. అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత గత ఐదేళ్లలో పాల దిగుబడిలో 55 శాతం వృద్ధి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగంలో సుదీర్ఘ కాలంగా పేరొందిన ఏపీ ఇప్పుడు డెయిరీ ఉత్పత్తిలో కూడా తన ఘనతను చాటుకుంది.

ఆంధ్రప్రదేశ్ అనగానే కోనసీమ అందాలు కళ్ల ముందు కదలాడుతాయి. పచ్చటి పచ్చిక బయళ్లు, పసుపుపచ్చని చీర చుట్టుకుందా? అన్నట్టుండే పంటపోలాలతో భూమాత చాలా అందంగా కనిపిస్తుంది. చిత్తూరు జిల్లాను పాడిపరిశ్రమకు ఆలవాలంగా పిలుస్తారు. చిత్తూరు డెయిరీ కూడా ఆస్థాయిలో పేరుతెచ్చుకుంది. కాలక్రమంలో చరిత్రలో కలిసిపోయిందనుకోండి. గత కొంత కాలంగా పాడి పరిశ్రమకు ఏపీలో మంచి ఆదరణ లభించింది. దీంతో రాష్ట్ర విభజనకు ముందు 24 శాతం పాల ఉత్పత్తి వృద్ధి సాధించిన ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది.

పాల ఉత్పత్తిలో గత ఐదేళ్లలో దేశం సగటున 6.4 శాతం వృద్ధిని నమోదు చేస్తే… ఆంధ్రప్రదేశ్ మాత్రం 11.72 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ 55 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో మధ్యప్రదేశ్ 47 శాతంతో నిలిచింది. తృతీయస్థానంలో 39 శాతంలో రాజస్థాన్ నిలవగా, ఆ తరువాతి స్థానంలో 21 శాతంతో ఉత్తరప్రదేశ్ నిలిచింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. 2014-15 సంవత్సరానికి 9.6 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2015-16 సంవత్సరానికి 10.81 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఇక 2016-17 సంవత్సరానికి 12.17 శాతం వృద్ధి, 2017-18 సంవత్సరానికి 13.72 శాతం, 2018-19 సంవత్సరానికి 15.04 శాతం వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

Next Story