మా వాళ్లను కొట్టి .. మాపైనే విమర్శలా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-09-23 09:37:27  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నాయకులు పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో హోంమంత్రి సుచరిత గురువారం పర్యటించారు. ఈ సంందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొప్పర్రులో వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను హోం మంత్రి సుచరిత పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలే కారం చల్లి, రాళ్లు విసిరి గందరగోళం సృష్టించారని [&hellip;]</p>

మా వాళ్లను కొట్టి .. మాపైనే విమర్శలా?
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నాయకులు పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో హోంమంత్రి సుచరిత గురువారం పర్యటించారు. ఈ సంందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొప్పర్రులో వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను హోం మంత్రి సుచరిత పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలే కారం చల్లి, రాళ్లు విసిరి గందరగోళం సృష్టించారని ఆరోపించారు.

టీడీపీ నేతల దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడి తమ పార్టీపైనే టీడీపీ అధినేత చంద్రబాబు నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై హోం మంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story