మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

111

దిశ వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరుతూ పలు రాజకీయ పార్టీలు దాఖలు చేసిన రిట్‌ అప్పీల్స్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. అయితే ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు కొనసాగించటం నిబంధనలకు విరద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. కోవిడ్‌ వలన సామాజిక మార్పులు జరిగాయని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం రిట్‌ అప్పీల్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. ఇది వరకే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..