ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

9

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం స్వీకరించింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో జీవో ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.