- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విగ్రహాల ధ్వంసం కేసులపై సిట్‌ఏర్పాటు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసులను ఛేదించేందుకు ప్రభుత్వం 16 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) చీఫ్‌గా విజయవాడ ఏసీబీ అడిషనల్డైరెక్టర్ జీవీజీ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దర్యాప్తు బృందంలో కృష్ణా, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 15 మంది పోలీసు అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ ఏడాది సెప్టెంబరు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసులను ఛేదించేందుకు ప్రభుత్వం 16 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) చీఫ్‌గా విజయవాడ ఏసీబీ అడిషనల్డైరెక్టర్ జీవీజీ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ దర్యాప్తు బృందంలో కృష్ణా, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 15 మంది పోలీసు అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటిదాకా నమోదైన విగ్రహాల ధ్వంసం కేసులపై దర్యాప్తు చేయనున్నారు. ప్రభుత్వం తొలుత ఈ కేసులను సీఐడీకి అప్పగించింది. కేసుల్లో సత్వర పురోగతి కోసం ప్రభుత్వం సిట్‌ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Next Story






