- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రుల రాజీనామాలు అంగీకరించిన ఏపీ గవర్నర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకరించారు. మోపిదేవి వెంకట్రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభకు పంపడంతో వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ నెల 22న రాజ్యసభ సభ్యులుగా వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అదేరోజు మంత్రి వర్గ విస్తరణకు సీఎం ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ గతంలోనే తమ మంత్రిపదవులకు రాజీనామాలు చేసినప్పటికీ గవర్నర్ […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అంగీకరించారు. మోపిదేవి వెంకట్రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభకు పంపడంతో వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ నెల 22న రాజ్యసభ సభ్యులుగా వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అదేరోజు మంత్రి వర్గ విస్తరణకు సీఎం ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ గతంలోనే తమ మంత్రిపదవులకు రాజీనామాలు చేసినప్పటికీ గవర్నర్ ఇప్పటికి ఆమోద ముద్ర వేశారు. వారి స్థానంలో ఇద్దరికి వైఎస్సార్సీపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించనుంది. ఇప్పటికే పేర్లు ఖరారైనప్పటికీ.. ప్రకటన వెలువడాల్సి ఉంది.
Next Story






