తెలంగాణ అప్పగిస్తేనే మేము అప్పగిస్తాం.. ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్

by  |
AP government
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అప్పగిస్తేనే తాము కూడా అందుకు సిద్ధమని జగన్ సర్కార్ షరతులు విధించింది. జూరాల ప్రాజెక్టును కూడా స్వాధీనం చేసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్‌కు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎగువ ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టును స్వాధీనం చేసుకోకపోతే శ్రీశైలంకు వచ్చే నీటి ప్రవాహానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇకపోతే కేఆర్ఎంబీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు అధికారులు, ప్లాంట్, యంత్రాలు, సిబ్బంది అప్పగింతపై జీవో జారీ చేసింది. కార్యాలయాలు, వాహనాలు, డీపీఆర్‌లు, ఇతర అంశాలపై జీవోలో స్పష్టం చేసింది. హెడ్ వర్కుల పరిధిలోని డ్యామ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ స్ట్రక్చర్లు అప్పగిస్తామని, అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల స్వాధీనానికి తెలంగాణ ఆమోదిస్తేనే అప్పగిస్తామంటూ కండీషన్ పెట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతల పధకం, ముచ్చుమర్రి పథకం పనులు కూడా అప్పగిస్తామని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.


Next Story