ఉత్తరాంధ్రలో అకాల వర్షం.. రైతులకు నష్టాలు

by  |
ఉత్తరాంధ్రలో అకాల వర్షం.. రైతులకు నష్టాలు
X

ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్సాలు కురుస్తున్నాయి. ఉదయమంతా తీవ్ర ఎండ, వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బంది పెడుతున్న వాతావరణం, మధ్యాహ్నామయ్యే సరికి తీవ్రమైన గాలులు, వానతో విరుచుకుపడుతోంది. అకాల వర్షాల ధాటికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రబీ సీజన్‌లో పంట చేతికొచ్చే తరుణంలో పడుతున్న వర్షాలు కన్నీటిపర్యంతం చేస్తున్నాయి. అరటి, బొప్పాయి తొటలు నేలకూలుతున్నాయి. మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షాలు మామిడి, జీడి మామిడి రైతుల పాలిట శాపంగా మారాయి. అసలే దిగుబడి తక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఉన్న ఆరాకొర పంట నేలపాలై నష్టాల పాలవుతున్నారు. వర్షాల ధాటికి నీటి మట్టమైన వరి పంటను చూసి వ్యవసాయదారులు లబోదిబో మంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు.

tags: agriculture, raining, rains, crop, unwanted rain


Next Story