మాస్కులు, పీపీఈ కిట్లతో కరోనాను అడ్డుకోగలమా?

by  |
మాస్కులు, పీపీఈ కిట్లతో కరోనాను అడ్డుకోగలమా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్ స్పందించిన తీరు ఆక్షేపనీయమని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం ఏపీ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ.. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. మాస్కులు, పీపీఈ కిట్లతో కరోనాను అడ్డుకోగలమా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ చెప్పినట్టు నడుచుకోవడానికి తాము సిద్దంగా లేమని తెలిపారు. ఎన్నికల నిర్వహణతో ఒక్కరు కూడా చనిపోరని హామీ ఇస్తారా అంటూ నిలదీశారు. ఉద్యోగుల విజ్ఞప్తిని ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మూడు నెలల పాటు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగులపై విమర్శలు సరికాదన్నారు. విమర్శిస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉద్యోగుల జోలికి అశోక్ బాబు రావొద్దని హెచ్చరిస్తున్నామని అన్నారు. అనవసరంగా ఉద్యోగులపై విమర్శలు చేస్తే అశోక్ బాబును రోడ్డుపైకి లాగుతామని హెచ్చరించారు.


Next Story

Most Viewed