- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై వాటర్ సరఫరాపై ఏపీ తిరకాసు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల నుంచి చెన్నై తాగునీటి సరఫరాపై ఏపీ పట్టు వీడడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి చెన్నైకి విడుదల చేయాల్సిన 15 టీఎంసీలపై మళ్లీ తప్పుడు లెక్కలకే దిగుతోంది. అయితే ఇప్పుడు చెన్నై కోసం ప్రత్యేకంగా విడుదల చేయడం కుదరంటూ చెప్పుతోంది. చెన్నై తాగునీటి సరఫరా అంశంపై కృష్ణా బోర్డు మంగళవారం ఐదు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. బోర్డు చైర్మన్ పరమేశం నిర్వహించిన ఈ సమావేశంలో చెన్నైకి తాగునీటిని విడుదల […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల నుంచి చెన్నై తాగునీటి సరఫరాపై ఏపీ పట్టు వీడడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి చెన్నైకి విడుదల చేయాల్సిన 15 టీఎంసీలపై మళ్లీ తప్పుడు లెక్కలకే దిగుతోంది. అయితే ఇప్పుడు చెన్నై కోసం ప్రత్యేకంగా విడుదల చేయడం కుదరంటూ చెప్పుతోంది. చెన్నై తాగునీటి సరఫరా అంశంపై కృష్ణా బోర్డు మంగళవారం ఐదు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. బోర్డు చైర్మన్ పరమేశం నిర్వహించిన ఈ సమావేశంలో చెన్నైకి తాగునీటిని విడుదల చేయాలని సూచించారు. దీనికి ఏపీ స్పందిస్తూ చిత్తూరుకు నీటిని వదలినప్పుడే చెన్నైకి ఇస్తామని, ప్రత్యేకంగా ఇప్పుడు ఇవ్వడం కుదరంటూ చెప్పుకొచ్చింది. వాస్తవంగా చెన్నై తాగునీటి అంశంలో ఏపీ ముందు నుంచీ తప్పుడు లెక్కలే చూపిస్తోంది. చెన్నై కోసం నీటిని తీసుకుంటున్నా అవి ఏపీ దాటి పోవడం లేదు. గత నీటి సంవత్సరంలో చెన్నైకి కేవలం నాలుగు టీఎంసీలే అందించారు. మిగిలిన టీఎంసీల లెక్కను ఏపీ చూపించడం లేదు. ఇక ఈ కాన్ఫరెన్స్‌లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు చెన్నై తాగునీటి అంశంలో సంసిద్ధతను వ్యక్తం చేశాయి. అయితే ఈ కమిటీ నుంచి తమ రాష్ట్రాలను మినహాయించాలని సూచించాయి. చెన్నైకి తాగునీటి అంశంలో అడ్డు చెప్పడం లేదని, కానీ ఈ సమావేశాలకు పిలువడం అనవసరమని, కమిటీ నుంచి తొలగించాలంటూ రెండు రాష్ట్రాలు కోరాయి. ఇక చెన్నై తాగునీటికి తెలంగాణ తరుఫున కూడా ఓకే చెప్పారు.






