- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు పర్యటనకు ఏపీ డీజీపీ అనుమతి!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు విజ్ఞప్తి అంశంలో డిజీపీ సానుకూలంగా స్పందించారు. సోమవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకోనున్నారు. అటు నుంచి ఆర్.ఆర్. వెంకటాపురంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులతో భేటీ కానున్నారు. తర్వాత ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన […]</p>

X
దిశ, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు విజ్ఞప్తి అంశంలో డిజీపీ సానుకూలంగా స్పందించారు. సోమవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకోనున్నారు. అటు నుంచి ఆర్.ఆర్. వెంకటాపురంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులతో భేటీ కానున్నారు. తర్వాత ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. అనంతరం సాయంత్రానికి రోడ్డు మార్గాన అమవరావతిలోని నివాసానికి చేరుకుంటారు.
Next Story






