- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి సన్నిధిలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరాహాస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆదిత్య నాథ్ దాస్‌కు పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చారు. టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆయనకు […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరాహాస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆదిత్య నాథ్ దాస్‌కు పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చారు. టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆయనకు స్వామివారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందించారు. ఆ సమయంలో సీఎస్‌తో పాటు టీటీడీ సీవీ ఎస్వో గోపీనాథ్ జెట్టి ఉన్నారు.
Next Story






