ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీబ్యూరో : ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వైద్యఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 78,992 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,058 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,66,175కి చేరింది. అదే సమయంలో కరోనాతో 23 మంది మరణించగా.. మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 13,377కి చేరింది. ఇకపోతే నిన్న ఒక్కరోజులో 2,053 మంది కరోనా నుంచి [&hellip;]</p>

AP corona Update
X

దిశ, ఏపీబ్యూరో : ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వైద్యఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 78,992 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,058 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,66,175కి చేరింది.

అదే సమయంలో కరోనాతో 23 మంది మరణించగా.. మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 13,377కి చేరింది. ఇకపోతే నిన్న ఒక్కరోజులో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,31,618కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,45,63,043 సాపింల్స్‌ని పరీక్షించినట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.

Next Story