- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72,731 సాంపిల్స్ పరీక్షించగా 2,100 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజులో 21 మంది కొవిడ్ బాధితులు మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 12,870కి […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72,731 సాంపిల్స్ పరీక్షించగా 2,100 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజులో 21 మంది కొవిడ్ బాధితులు మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 12,870కి చేరింది. ఇదే సమయంలో 3,435 మంది కొవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా..ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 18,58,189కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 33,964 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,24,35,809 సాంపిల్స్ పరీక్షించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.






