- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌ది వేటగాడి మనస్తత్వం : తులసిరెడ్డి
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘వైసీపీ రౌడీల పార్టీ అని.. జగన్‌ది వేటగాడి మనస్తత్వమని ఆరోపించారు. వేటగాడు పావురాలకి ఆహారాన్ని వేస్తారని.. అది పావురాల మీద ప్రేమతో కాదని పావురాల మాంసం మీద అని.. జగన్ తీరు కూడా అంతేనని తులసిరెడ్డి ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన వస్తుందని అప్పుడే చెప్పానని […]</p>

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘వైసీపీ రౌడీల పార్టీ అని.. జగన్‌ది వేటగాడి మనస్తత్వమని ఆరోపించారు. వేటగాడు పావురాలకి ఆహారాన్ని వేస్తారని.. అది పావురాల మీద ప్రేమతో కాదని పావురాల మాంసం మీద అని.. జగన్ తీరు కూడా అంతేనని తులసిరెడ్డి ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన వస్తుందని అప్పుడే చెప్పానని అది ఇప్పుడు నిరూపితమవుతుందన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీకి తోక పార్టీలేనని విమర్శించారు. బీజేపీ చంకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ దద్దమ్మ పార్టీ అయితే జనం లేని పార్టీ జనసేన అని విమర్శించారు. ఇక వైసీపీ అయితే ఏపీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు బీజేపీకి బినామీలేనంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరి పార్టీ అని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.






