రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు 

218

దిశ, ఏపీ బ్యూరో: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలన్నారు.  విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..