రాయలసీమ అవసరాల కోసం.. ప్రధానికి జగన్ లేఖ

by  |
రాయలసీమ అవసరాల కోసం.. ప్రధానికి జగన్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి లేఖ రాశారు. ఏపీకి రావాల్సిన ఆక్సిజన్ కోటాను పెంచాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీ గతంలో కంటే ఇప్పుడు ఆక్సిజన్‌ సరఫరా పెంచినందుకు, 7 కంటైనర్లు ఇచ్చినందుకు ప్రధానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్స్‌ 30 వేలకు పెంచామని, రోజూ 910 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌సరఫరా అవసరం ఉందన్నారు. విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌ నుంచి కేటాయించిన 170 మెట్రిక్ టన్నులకు బదులు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే వస్తోందని, కర్ణాటక, తమిళనాడు నుంచి ఏపీకి కేటాయిచిన మేర ఆక్సిజన్‌ రావడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. దీంతో రాయలసీమలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ఒరిస్సా నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌ తెచ్చుకునేందుకు పూర్తిగా కృషి చేస్తున్నామని, రాయలసీమ అవసరాలను నిమిత్తం ఏపీకి ప్రతిరోజూ 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ పంపాలని లేఖలో కోరారు.


Next Story

Most Viewed