రాయలసీమలో సీఎం జగన్ పర్యటన.. ఎప్పుడంటే?

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 7 నుంచి 9 వరకు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. అనంతరం అదే జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి [&hellip;]</p>

రాయలసీమలో సీఎం జగన్ పర్యటన.. ఎప్పుడంటే?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 7 నుంచి 9 వరకు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. అనంతరం అదే జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కడప జిల్లా పర్యటన అనంతరం అనంతపురం జిల్లాలో కూడా సీఎం జగన్ పర్యటించనున్నారు. అనంతపురం జిల్లాల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Next Story