- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటున్నారు: జగన్
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడిలోని విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని.. తప్పు ఎవరు చేసినా తప్పే అని సీఎం జగన్ చెప్పారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. కొందరికి దేవుడు అంటే కూడా భయం, భక్తి లేదని.. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలను టార్గెట్ చేసుకొని దాడులకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడిలోని విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని.. తప్పు ఎవరు చేసినా తప్పే అని సీఎం జగన్ చెప్పారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. కొందరికి దేవుడు అంటే కూడా భయం, భక్తి లేదని.. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరకుండా కుట్రలు చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు. దీనికి తోడు దాడి చేసిన వారే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పేరును నాశనం చేసేందుకు ఇటువంటి దాడులు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు.






