కరోనా పేరిట ధరలు పెంచితే కఠిన చర్యలు: జగన్

by Vemula.Srinu Prasad |

<p>కరోనాను సాకుగా చూపించి ధరలు పెంచితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. అయితే అప్రమత్తత అవసరమని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన హితవు పలికారు. దుకాణాలు అన్ని అందుబాటులో ఉంటాయని.. నిత్యావసర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనాను సాకుగా చూపించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి సీఎం [&hellip;]</p>

కరోనా పేరిట ధరలు పెంచితే కఠిన చర్యలు: జగన్
X

కరోనాను సాకుగా చూపించి ధరలు పెంచితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. అయితే అప్రమత్తత అవసరమని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన హితవు పలికారు. దుకాణాలు అన్ని అందుబాటులో ఉంటాయని.. నిత్యావసర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనాను సాకుగా చూపించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి సీఎం వ్యాపారులను హెచ్చరించారు. గ్రామ సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్లకు సూచించారు.

మాస్క్‌లు వాడేవాళ్లు వాటిని సరైన పద్దతిలో డిస్పోజ్‌ చేయాలని ఆయన సూచించారు. మాస్క్‌లను ఎక్కడిపడితే అక్కడ పడేస్తే ప్రమాదకరమన్నా ఆయన, వాటిని ఐదు గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుందని సూచించారు. వైద్య సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు వేసుకోవాలని ఆయన ఆదేశించారు. 65 ఏళ్లకు పైబడ్డ వయస్సు గలవారిపై కరోనా వైరస్‌ తీవ్రప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. యువకులు, బాలల నుంచి సోకినా వృద్ధులకు ప్రమాదమన్నారు. కిడ్నీ, షుగర్, హృదయ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు దీనిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.

దేశం మొత్తం మీద కేవలం 191 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. ఏపీలో కేవలం మూడు కేసులే నమోదయ్యాయని అన్నారు. ఈ మూడు కూడా విదేశాల నుంచి వచ్చినవేనని, ఒకరు ఇటలీ, మరొకరు యూకే, ఇంకొకరు సౌదీ నుంచి వచ్చారని తెలిపారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 80.9 శాతం మంది ఇళ్లలోనే ఉండి వైద్యం తీసుకున్నారని చెప్పారు. 13.8 శాతం మంది మాత్రమే కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని, అందులో కూడా కేవలం 4.7 శాతం కేసులు మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులున్నాయని ఆయన వెల్లడించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నియంత్రించవచ్చని ఆయన తెలిపారు.

tags : corona, covid-19, ap cm, jagan,

Next Story