ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

1700

దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టులతో పాటు వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి నాని వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..