- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అభివృద్ధితోనే అధికారంలోకి వస్తాం’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవీఎల్ అన్నారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ దియోధర్, జీవీఎల్ సోము వీర్రాజును ఘనంగా సన్మానించారు. అనంతరం సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి తన వంతు సాయం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సోము వీర్రాజు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవీఎల్ అన్నారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ దియోధర్, జీవీఎల్ సోము వీర్రాజును ఘనంగా సన్మానించారు.
అనంతరం సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి తన వంతు సాయం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సోము వీర్రాజు నేతృత్వంలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందన్నారు. ఏపీలో హిందూత్వ విధానానికి ప్రతీకగా సోము వీర్రాజు నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగారు ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులేస్తామన్నారు. కేవలం తాము చేస్తున్న అభివృద్ధితోనే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
Next Story






