అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం: బీజేపీ చీఫ్ సోము వీర్రాజు 

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీస్ కూడా అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని నిర్మించి తీరతామని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని ఆరోపించారు. రాజధాని విషయంలో అటు [&hellip;]</p>

అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం: బీజేపీ చీఫ్ సోము వీర్రాజు 
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీస్ కూడా అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని నిర్మించి తీరతామని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని ఆరోపించారు. రాజధాని విషయంలో అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని సోము వీర్రాజు ఆరోపించారు.

somu veerraju

Next Story