- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంతతే ప్రధానం : అనుష్క శర్మ
<p>బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రతీ విషయంలోనూ పాజిటివ్‌గా ఉంటుంది. విరాట్ కోహ్లీతో పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉంటున్నానని చెప్తున్న అనుష్క.. చివరగా 2018లో వచ్చిన జీరో సినిమాలో కనిపించింది. ఇప్పుడు సోదరునితో కలిసి క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారింది. పాతాళ్ లోక్ సిరీస్‌తో ప్రొడ్యూసర్‌గా ఫస్ట్ హిట్ అందుకున్న అనుష్క.. తాజాగా బుల్ బుల్ సిరీస్‌తో నిర్మాతగా మరో హిట్ తన అకౌంట్‌లో వేసేసుకుంది. కాగా ఈ రెండు సిరీస్‌లకు […]</p>

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రతీ విషయంలోనూ పాజిటివ్‌గా ఉంటుంది. విరాట్ కోహ్లీతో పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉంటున్నానని చెప్తున్న అనుష్క.. చివరగా 2018లో వచ్చిన జీరో సినిమాలో కనిపించింది. ఇప్పుడు సోదరునితో కలిసి క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారింది. పాతాళ్ లోక్ సిరీస్‌తో ప్రొడ్యూసర్‌గా ఫస్ట్ హిట్ అందుకున్న అనుష్క.. తాజాగా బుల్ బుల్ సిరీస్‌తో నిర్మాతగా మరో హిట్ తన అకౌంట్‌లో వేసేసుకుంది. కాగా ఈ రెండు సిరీస్‌లకు కూడా కేవలం నిర్మాతగానే వ్యవహరించిన అనుష్క.. ఇప్పటి వరకు హీరోయిన్‌గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే, జూలై వోగ్ ఇండియా కవర్ పేజీపై నేవీ బ్లూ స్విమ్ సూట్‌లో చాలా హాట్‌గా దర్శనమిచ్చిన అనుష్క.. గత మూడేళ్లుగా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నానని తెలిపింది. ‘లైఫ్‌లో ఏం సాధించాం.. అనే విషయంతో పాటు ఎంత ప్రశాంతంగా ఉన్నాం’ అనేది కూడా చాలా ముఖ్యమని అంటోంది. ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని.. ఇతరుల పట్ల జాలి, దయతో ఉంటూ.. వారిని జడ్జ్ చేయడంలో తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.






