దీపికా పదుకునే, అనుష్క శర్మల ‘‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’’

by  |
దీపికా పదుకునే, అనుష్క శర్మల ‘‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’’
X

ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్, గ్రీన్ చాలెంజ్ ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఛాలెంజ్‌లు వ‌చ్చాయి. వాటిలో దేనిక‌దే ప్ర‌త్యేకం. తాజాగా ‘‘సేఫ్ హ్యాండ్స్’ అనే ఛాలెంజ్ న‌డుస్తోంది. కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో టెడ్రోస్( డ‌బ్ల్యూహెచ్‌వో జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్‌) స‌రికొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన వారు చేతుల‌ని శుభ్రంగా క‌డుక్కోవ‌డంతోపాటు మ‌రో ముగ్గురు లేదా న‌లుగురికి ఛాలెంజ్ విస‌రాలి.

కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్వో జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ విసిరిన చాలెంజ్ ను ఇప్పటికే ఎంతోమంది సెలబ్రీటీలు, క్రికెటర్లు ఫాలో అవుతున్నారు. తాము చేతులు కడుక్కుంటూ, మరో ముగ్గురిని చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. టెడ్రోస్.. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణేకి ‘‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’’ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీక‌రించిన దీపికా తన చేతుల‌ను స‌బ్బుతో శుభ్రంగా క‌డుక్కుంటున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ విరాట్ కోహ్లీ, రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌, క్రిస్టియానో రొనాల్డోల‌ని నామినేట్ చేసింది. త‌న‌ని నామినేట్ చేసిన టెడ్రోస్‌కి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తూ.. ఈ ఛాలెంజ్ ప్ర‌జ‌ల ఆరోగ్యన్ని త‌ప్ప‌క కాపాడుతుందని, దీనిని ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క పాటించాల‌ని పిలుపునిచ్చింది దీపికా.

ప్రియాంక చోప్రా, ఆర్నాల్డ్‌ల‌కు కూడా..

టెడ్రోస్‌.. ప్రియాంక చోప్రా, ఆర్నాల్డ్‌ల‌ని కూడా నామినేట్ చేశారు. ప్రముఖ సినీనటి అనుష్క శర్మ బుధవారం ‘‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’’ విసిరారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు మేరకు ముందు జాగ్రత్త చర్యగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ తన చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోని ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరారు. సబ్బుతో తన చేతులు కడుక్కుంటున్న వీడియోను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. యాంకర్ సుమ ‘ప్రతి ఒక్కరూ 20 నుంచి 30 సెకన్లపాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని, ఎంత శుభ్రంగా ఉంటే కరోనాను అంత దీటుగా ఎదుర్కోవచ్చు’ అని తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అథ్లెట్ హిమదాస్ విసిరిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వీకరించాడు. సానియా మీర్జా, రాణి రాంపాల్, మేరికోమ్‌లకు కూడా హిమదాస్ ఈ సవాల్ విసిరింది. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా చేతులు శుబ్రంగా కడుక్కోవాలంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసింది.



Next Story

Most Viewed