అనుష్క ఆ సినిమాకు కూడా ఆడిషన్ ఇచ్చిందా..?

by  |
అనుష్క ఆ సినిమాకు కూడా ఆడిషన్ ఇచ్చిందా..?
X

దిశ, సినిమా : హీరోయిన్ అనుష్క శర్మ ‘రబ్ నే బనాది జోడీ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో జతకట్టిన భామ.. చాలా తక్కువ సమయంలో స్టార్ రేంజ్ సొంతం చేసుకుంది. ఇక నాలుగేళ్ల కిందట ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన ఆమె.. ప్రస్తుతం నిర్మాతగానూ రాణిస్తోంది. ఈ క్రమంలో ‘పాతాళ్ లోక్’, ‘బుల్ బుల్’ లాంటి సిరీస్‌లు నిర్మించిన తను ఇప్పుడు మరో సినిమా కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే తొలి సినిమాకు ముందు అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’ మూవీకి అనుష్క కూడా ఆడిషన్ ఇచ్చిందట. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్న అభిమానులు.. ఈ క్లిపింగ్‌‌ను తనకు డెడికేట్ చేశామని చెప్తున్నారు. ఈ వీడియోలో గ్రీన్ డ్రెస్‌లో కనిపిస్తున్న అనుష్క ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ మూవీలోని గ్రేసీ సింగ్ డైలాగ్ చెప్పింది. అయితే ‘త్రీ ఇడియట్స్‌’ కోసం ఇచ్చిన ఆడిషన్‌‌లో సెలెక్ట్ కాలేకపోయినా, కింగ్ ఖాన్‌కు జోడీగా లాంచ్ అయ్యే అదృష్టం దక్కించుకుందని అంటున్నారు అభిమానులు.

Next Story