మొక్కకు హీరోయిన్ పేరు పెట్టిన అనుపమ

by  |
మొక్కకు హీరోయిన్ పేరు పెట్టిన అనుపమ
X

సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సమంత, రష్మిక మందాన, కళ్యాణి ప్రియదర్శన్, లక్ష్మీ మంచు, శర్వానంద్.. ఇలా చాలా మంది స్టార్లు మొక్కలు నాటుతూ.. అభిమానులను, తోటి నటులను కూడా ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కల్యాణి ప్రియదర్శన్ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్.

https://www.instagram.com/p/CC5NSvDJI4-/?utm_source=ig_web_copy_link

బ్రెజిలియన్ మల్బరీ మొక్కను నాటిన అనుపమ.. తనను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసిన కల్యాణి పేరునే ఈ మొక్కకు పెట్టటం విశేషం. కాగా కొద్ది రోజుల క్రితమే ఇంట్లో 25 మొక్కలు నాటామని.. కానీ వాటిలో రెండు మొక్కలు ఎండిపోవడంతో అప్‌సెట్ అయినట్లు తెలిపింది. కానీ ‘హరా హై తో భరా హై’ చాలెంజ్‌తో సంతోషంగా ఉన్నట్లు తెలిపిన అనుపమ.. సాధారణంగా మూడు మొక్కలు నాటాలి కానీ, తమ ఏరియా కంటైన్మెంట్ జోన్‌లో ఉందని తెలిపింది. మొక్కలు కొనేందుకు బయటకెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఒకే మొక్కను నాటుతున్నానని చెప్పింది. పరిస్థితులు చక్కబడ్డాక కచ్చితంగా మరో రెండు మొక్కలు పెడతానని ప్రామిస్ చేసింది.

కాగా, ఈ చాలెంజ్‌కు హీరోయిన్ శోభిత ధూళిపాళ, నివేదా థామస్‌తో పాటు 13 మంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ను నామినేట్ చేసింది. అభిమానులు కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించి చైన్ కొనసాగించాలని కోరింది.



Next Story

Most Viewed