- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు.. వీడియో
<p>దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలో డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రోద్బలంతో ఎన్‌సీబీ అధికారులు విడుదల చేశారని చెప్పారు. క్రూయిజ్ షిప్‌పై దాడి అనంతరం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారని నవాబ్ మాలిక్ గుర్తుచేశారు. కానీ, వారిలో 8 మందిని మాత్రమే […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలో డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రోద్బలంతో ఎన్‌సీబీ అధికారులు విడుదల చేశారని చెప్పారు. క్రూయిజ్ షిప్‌పై దాడి అనంతరం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారని నవాబ్ మాలిక్ గుర్తుచేశారు.
కానీ, వారిలో 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రిషభ్ సత్యదేవ్, ప్రతిక్ గాబా, అమిర్ ఫర్నిచర్‌వాలాను ఓ బీజేపీ నేత తప్పించారని పేర్కొన్నారు. ఆయన జోక్యం అనంతరం వారిని ఎన్‌సీబీ అధికారులు విడుదల చేశారని మంత్రి ఆరోపించారు. ఈ మేరకు కొన్ని వీడియోలను మంత్రి విడుదల చేశారు. ఎవరి ఆదేశాల మేరకు ఆ ముగ్గురిని డ్రగ్స్ కేసు నుంచి తప్పించారో ఎన్‌సీబీ తెలపాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ కూడా రాసినట్లు పేర్కొన్నారు.
Rishabh Sachdeva and Pratik Gaba can be seen exiting from the NCB office after detention. pic.twitter.com/1KTS3QykPs
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 9, 2021
Aamir Furniturewala can be seen exiting from the NCB office after detention. pic.twitter.com/c956NA4YBn
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 9, 2021






