అంతర్వేదిలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం

92

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు మంత్రి వేణుగోపాల కృష్ణ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అంతర్వేదిలో నూతన రథంపై స్వామి, అమ్మవార్ల రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. కళ్యాణోత్సవం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భారీగా తరలివచ్చారు.

కాగా, గతేడాది సెప్టెంబర్ నెలలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైంది. రథం దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రథం మంటల్లో కాలిపోవడంతో 2021లో అంతర్వేది రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని నాలుగు రోజుల క్రితం రథసప్తమి రోజున పూజలు చేసి ప్రారంభించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..