వివాదంలో మరో టీఆర్ఎస్ నేత.. ఈ సారి అదనపు కలెక్టర్‌తో…

by  |
trs leader collector
X

దిశ, ఆదిలాబాద్: టీఆర్ఎస్ నాయకుల తీరు వివాదాలకు దారి తీస్తున్నది. నిన్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్, నేడు గంగుల కమలాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరవకముందే తాజాగా… ఆదిలాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకున్నది. శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువును అదనపు కలెక్టర్ డేవిడ్ సందర్శించారు. చెరువులో చెత్త వేయద్దని చెరువును కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న వారు ఖాళీ చేయాలని సూచించారు. అక్కడే ఉన్నా అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని అదనపు కలెక్టర్ పై నోరు పారేసుకున్నారు. తాము చెరువు కబ్జా చేయలేదని, చెత్తను ఎక్కడ వేయాలంటూ అదనపు కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు.

చెత్త సేకరనకు మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు చెత్తను అందజేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఇదేమి వినకుండా వైస్ చైర్మన్, అనుచరులతో హోదాను మరిచి వాగ్వాదానికి దిగడంతో విమర్శలకు తావిస్తున్నది. ఇలా రాష్ట్రంలో రోజుకో చోట టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార అహంకారంతో అధికారుల పై దురుసుగా ప్రవర్తించడం, మహిళా అధికారుల అని చూడకుండా డబుల్ మీనింగ్ తో మాట్లాడడంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతుండగా ప్రజలు అధికార పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story