TRS నేతలకు హై టెన్షన్.. హుజూరాబాద్‌లో కారును పోలిన మరో గుర్తు

by  |
TRS నేతలకు హై టెన్షన్.. హుజూరాబాద్‌లో కారును పోలిన మరో గుర్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో మరో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించి గెల్లును గెలిపించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రచారం అంతా సాఫీగా సాగినా.. ఓటింగ్‌కు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయలేకపోతున్నారు. ఎందుకంటే, కారు గుర్తును పోలిన మరో గుర్తు కొందరు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజాఏక్తా పార్టీ నుంచి సిలివేరు శ్రీకాంత్ బరిలో ఉన్నారు. ఈయన గుర్తు రొట్టెల పీట, కర్ర. అచ్చం కారు బొమ్మలా ఉండే ఈ గుర్తు ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారింది. గతంలోనూ దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి ఈ గుర్తే కారణం.. ఎందుకంటే.. దుబ్బాకలో ఈ గుర్తుకి 3,570 ఓట్లు రాగా, 2019లో కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో ఈ గుర్తుకు 6800 ఓట్లు వచ్చాయి. దీంతో హుజూరాబాద్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులకు గుర్తు పట్టే విధంగా కారు గుర్తుకే ఓటేయాలని ఒకటికి పది సార్లు చెబుతున్నారు.


Next Story

Most Viewed