- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగర్ సునీత పేరుతో మరో మోసం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ సునీత పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన నిందితుడు చైతన్య మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సింగర్ సునీత అభిమాని నుంచి నిందితుడు చైతన్య రూ. 1.70 కోట్లు కొట్టేశాడు. ఈ మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. కేరళలో ‘ఆనందం చెర్లాయం ట్రస్టు’ పేరుతో రూ. 50 లక్షలు వసూలు చేశాడు. ఈ క్రమంలో సునీత ఆడియో, వీడియో మెసేజ్ లు చూపించి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ సునీత పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన నిందితుడు చైతన్య మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సింగర్ సునీత అభిమాని నుంచి నిందితుడు చైతన్య రూ. 1.70 కోట్లు కొట్టేశాడు. ఈ మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
కేరళలో ‘ఆనందం చెర్లాయం ట్రస్టు’ పేరుతో రూ. 50 లక్షలు వసూలు చేశాడు. ఈ క్రమంలో సునీత ఆడియో, వీడియో మెసేజ్ లు చూపించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో చైతన్యతోపాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, ఇప్పటికే నిందితుడు చైతన్యను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Next Story






