- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మధ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఏపీలోని రాయలసీమలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మధ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ఏపీలోని రాయలసీమలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోనూ వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Next Story






