- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లికి వచ్చిన మహిళకు కరోనా
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: యదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆలేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకింది. జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతుండటంతో ఈ నెల 2న వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌గా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల సదరు మహిళ కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం మే 28న సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్య […]</p>

X
దిశ, నల్లగొండ: యదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆలేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకింది. జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతుండటంతో ఈ నెల 2న వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌గా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల సదరు మహిళ కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం మే 28న సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 2న కరోనా పరీక్షలు చేసి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. వెంటనే ఆమెను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ మే నెల 27న ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తేలింది. దీంతో వివాహానికి హాజరైన వారి వివరాలు సేకరించి వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
Next Story






