నాలాలో పడి మరో వ్యక్తి గల్లంతు.. ఆలస్యంగా వెలుగులోకి

by  |
drainage, Mohan Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: గులాబ్ తుఫాను కారణంగా కరిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ జలమయమయ్యింది. నగరంలోని నాలాలు వరదనీటితో పొంగిపొర్లాయి. ఈ క్రమంలో రోడ్లపై నీరు చేరి చెరువులను తలపించాయి. దీంతో మణికొండ‌లో రజినీకాంత్ అనే యువకుడు డ్రైనేజీలో కొట్టుకుపోయాడు. మణికొండకు మూడు కిలోమీటర్ల దూరంలోని నేక్నంపూర్ చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే కుత్బుల్లాపూర్ గణేష్ టవర్స్ వద్ద నివాసముండే మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల రాయల్ వైన్స్ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయి కొట్టుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్నేహితులతో కలిసి మద్యం సేవించి నాలాలో పడిపోయారు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా.. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. పోలీసులకు సమాచారం అందించగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అది కుత్బుల్లాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే నాలాగా పోలీసులు గుర్తించారు. నీటి ప్రవాహం తగ్గడంతో గురువారం కుటుంబ సభ్యుల సమక్షంలో గాలింపు చర్యలను మరింత పటిష్టం చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Next Story