ఛీ.. ఛీ డబ్బుకోసం మరదలితో ఆ పనిచేయించాలా..?

by  |
ఛీ.. ఛీ డబ్బుకోసం మరదలితో ఆ పనిచేయించాలా..?
X

దిశ, వెబ్‌డస్క్: డబ్బు ఎంతటి పనిచేయడానికైనా ప్రేరెపిస్తుంది అంటారు. అలా స్నేహం ముసుగులో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. స్నేహితుడు డబ్బున్నవాడైతే కొందమంది సంతోష పడుతారు, మరికొందరు తన వద్ద ఉన్న డబ్బును ఎలా లాగేసుకోవాలని ప్రయత్నిస్తారు. అయితే ఒకతను మాత్రం డబ్బున్న స్నేహితునికి ఏకంగా తన మరదలిని ఎర వేసిన ఘటన హైదరాబాద్‌ అంబర్‌పేటలో వెలుగు చూసిందలి.

వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరుకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే తనకు అంబర్‌పేటకు చెందిన సాయిరాం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొద్దిరోజులకు వీరి పరిచయం కాస్త స్నేహంగా మారి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే సుబ్బారెడ్డి పెద్ద భూస్వామి అని గ్రహించిన సాయిరాం.. బాగ్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో ఉంటున్న తన మరదలు అర్చన అలియాస్‌ సంజన అలియాస్‌ నిధితో పాటు.. ఆమె స్నేహితుడు అనిల్‌కుమార్‌ రంగంలోకి దింపాడు. ఎలాగైనా తన నుంచి డబ్బులు కాజేయాలని పథకం పన్నారు. అన్నుకున్నదే తడువుగా తన మరదలికి సుబ్బారెడ్డి నెంబర్ ఇచ్చి ప్రేమాయణం నడిపించాడు. వీరు చాట్ చేస్తూ ప్రేమలో పడిపోయారు సజన లేకుంటే ఉండలేను అనే అంతగా సుబ్బారెడ్డి సంజనను ప్రేమించాడు. అలాగే సంజన ఎప్పుడు డబ్బులు అడిగినా కానీ, సుబ్బారెడ్డి ప్రేమతో పంపేవాడు. ఇలా ఏకంగా రూ. 1.2 కోట్లు కొల్లగొట్టారు. చివరికి సంజన ప్రవర్తనలో తేడా గమనించిన సుబ్బారెడ్డి సంజనకు ఫొన్ చేసి అసలు ఏంటి అని అడిగే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.



Next Story

Most Viewed