అంతర్వేదిలో మరో కొత్త వివాదం…

by  |

దిశ వెబ్ డెస్క్ :
అంతర్వేదిలో మరో కొత్త వివాదం చోటు చేసుకుంది. రేపు ఉదయం 11.15 నిమిషాలకు అంతర్వేది నూతన రథం నిర్మాణానికి పనులు ప్రారంభించనున్నారు. కాగా నరసింహ హోమంతో ఈ పనులను ప్రారంభించనున్నారు. అయితే రథం నిర్మాణానికి టెండర్లు పిలవకుండా కొటేషన్ పద్దతిలో పనులు అప్పజెప్పారు. దీంతో టెండర్లను పిలవకుండా పనులు ఎలా చేస్తారని అగ్నికుల క్షత్రియులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆశ్రయించే యోచనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ నెల 5న అర్థరాత్రి అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్దం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దుమారం రేగడంతో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దగ్దం అయిన రథం స్థానంలో మరో నూతన రథాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed