దేశంలో మూడుకు చేరిన కరోనా మరణాలు

by Shamantha N |

<p>ప్రపంచాన్ని చిగురుటాకుల వణికిస్తున్న కరోనా మనదేశంలోనూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా మరో కరోనా మరణం సభవించింది. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలో కరోనా సోకిన 64 ఏళ్ల వృద్ధుడు ముంబయిలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు అధికారులు ధృ‌వీకరించారు. ఇప్పటికే ఢిల్లీలో ఒకరు, కర్నాటకలో మరొకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 125 నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య [&hellip;]</p>

ప్రపంచాన్ని చిగురుటాకుల వణికిస్తున్న కరోనా మనదేశంలోనూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా మరో కరోనా మరణం సభవించింది. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలో కరోనా సోకిన 64 ఏళ్ల వృద్ధుడు ముంబయిలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు అధికారులు ధృ‌వీకరించారు. ఇప్పటికే ఢిల్లీలో ఒకరు, కర్నాటకలో మరొకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 125 నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 39 మందికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Tags: corona, death, mumbai, national news

Next Story