Raj kundra: మరో నటి ఫిర్యాదు.. తన ప్రైవేట్ భాగాలను వీడియో తీసి

by  |
Raj kundra: మరో నటి ఫిర్యాదు.. తన ప్రైవేట్ భాగాలను వీడియో తీసి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లో సంచలనం రేపుతోన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా తమను బలవంతంగా పోర్న్ వీడియోలలో నటించేలా చేసాడని పలువురు మోడల్స్ కేసు పెట్టారు.. ఇంకొంతమంది తమను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా మరో నటి తన బాధను వెళ్లగక్కింది. రాజ్ కుంద్రా మోసం చేసిన వారిలో తాను కూడా ఉన్నానని పోలీసులను ఆశ్రయించిందని సమాచారం.

వివరాలలోకి వెళితే.. ముంబైకి చెందిన ఒక నటి.. రాజ్ కుంద్రా హాట్ షాట్స్ కోసం పోర్న్ వీడియోలో నటించింది. అయితే వీడియోలో తన ప్రైవేట్ భాగాలను బ్లర్ చేయాలనీ కండిషన్ పెట్టి, కాంట్రాక్టులో సైన్ చేసింది. అందుకు సరే అన్న రాజ్ కుంద్రా తన అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలను హాట్‌షాట్స్‌ యాప్‌లో రాజ్‌కుంద్రా విడుదల చేశారు. ఇక ఈ విషయం ఇటీవల తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్న నటి, రాజ్ కుంద్రా మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన ప్రైవేట్ భాగాలను బ్లర్ చేయకుండా అలాగే వీడియోలో చూపించారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ కేసును కూడా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు.



Next Story

Most Viewed