మరో ఏడుగురిని బలిగొన్న కల్తీ మద్యం

29

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌‌లోని మురైన్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో ఏడుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 20 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఈ ఘటనను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దాంతో మురైన్ కలెక్టర్, ఎస్పీ తొలగింపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.