- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంకిత రైనా అరుదైన ఘనత
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : యువ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఆదివారం అరుదైన ఘనతను అందుకున్నది. ఓపెన్ టెన్నిస్ శకం మొదలైన తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు నేరుగా ఎన్నికైన 5వ భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఈ ఏడాది జరగనున్న తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో డబుల్స్ విభాగం మెయిన్ డ్రాలో అంకిత రైనా ఎంపికైంది. రొమేనియాకు చెందిన మిహీల […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : యువ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఆదివారం అరుదైన ఘనతను అందుకున్నది. ఓపెన్ టెన్నిస్ శకం మొదలైన తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు నేరుగా ఎన్నికైన 5వ భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఈ ఏడాది జరగనున్న తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో డబుల్స్ విభాగం మెయిన్ డ్రాలో అంకిత రైనా ఎంపికైంది. రొమేనియాకు చెందిన మిహీల బుజారెన్సుతో కలసి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళ డబుల్స్‌లో అంకిత రైనా ఆడనున్నది. అంకిత కంటే ముందు నిరుపమ మన్కడ్ (1971), నిరుపమ విద్యానాథన్ (1998), సానియా మీర్జా (1998), శిఖా ఓబెరాయ్ (2004) మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే శిఖా ఓబెరాయ్ ఇండో-అమెరికన్ క్రీడాకారిణి. దీంతో సానియా తర్వాత ఈ ఘనత సాధించింది అంకిత అనే చెప్పాలి.
Next Story






