- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు రింగులు మార్చుకున్న లవ్ బర్డ్స్.. వీడియో వైరల్
<p>దిశ, సినిమా : బీటౌన్ యాక్ట్రెస్ అంకితా లోఖండే, తన ప్రియుడు విక్కీ జైన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ పార్టీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలో లోఖండే టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కుమనగా.. విక్కీ వైట్ సూట్‌లో దర్శనమిచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ పార్టీలో ఓ విశేషం చోటుచేసుకుంది. ఈ జంట రింగులు మార్చుకుంటుండగా.. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘రాబ్తా’ […]</p>

దిశ, సినిమా : బీటౌన్ యాక్ట్రెస్ అంకితా లోఖండే, తన ప్రియుడు విక్కీ జైన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ పార్టీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలో లోఖండే టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కుమనగా.. విక్కీ వైట్ సూట్‌లో దర్శనమిచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ పార్టీలో ఓ విశేషం చోటుచేసుకుంది. ఈ జంట రింగులు మార్చుకుంటుండగా.. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘రాబ్తా’ చిత్రంలోని టైటిల్ ట్రాక్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విక్కీ.. ‘నేను ఇంతకుముందు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండేవాన్ని. కానీ ఇకపై తనే ప్రపంచంగా నా ప్రేమను చూపిస్తాను’ అన్నాడు. ఇక విక్కీ భాగస్వామిగా దొరికినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని లోఖండే వివరించింది. కాగా అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటను ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
- Tags
- Ankita lokhande






