ముద్దుల్లో మునిగి తేలిన స్టార్.. దివాళీ పార్టీలో బాయ్‌ఫ్రెండ్‌తో అలా కనిపిస్తూ..

by  |
ముద్దుల్లో మునిగి తేలిన స్టార్.. దివాళీ పార్టీలో బాయ్‌ఫ్రెండ్‌తో అలా కనిపిస్తూ..
X

దిశ, సినిమా : టెలివిజన్ స్టార్ అంఖితా లోఖండే తాజాగా ఫ్రెండ్స్‌తో కలిసి దివాళీ పార్టీకి హాజరైంది. ఇక ఈ పార్టీకి తన బాయ్‌ఫ్రెండ్ విక్కీ జైన్ కూడా హాజరు కాగా.. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది అంఖిత. మెరూన్ కలర్ చీర, భుజాలపై జాలువారే కురులతో తను గాడ్జియస్‌ లుక్‌లో కనిపించగా.. విక్కీ బ్లాక్ ఫార్మల్స్‌లో స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. అసలు విషయానికొస్తే.. పార్టీలో ఇద్దరూ జంటగా డ్యాన్స్ చేస్తూ ముద్దుల్లో మునిగితేలడం అందరి అటెన్షన్‌ను అట్రాక్ట్ చేసింది. ఇక అంఖిత షేర్ చేసిన పిక్స్‌లో పర్టిక్యులర్‌గా కిస్సింగ్ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ త్వరలోనే మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘పవిత్ర రిష్టా’ సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించిన అంఖిత.. కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించిన ‘మణికర్ణిక’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.



Next Story