పెళ్లికి సిద్ధమవుతున్న సుశాంత్ ఎక్స్‌ గర్ల్ ఫ్రెండ్

121

దిశ, సినిమా: లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంకితాలోఖండే పెళ్లికి సిద్ధమవుతోంది. గత మూడేళ్లుగా బిజినెస్ మెన్ విక్కీ జైన్‌తో డేటింగ్‌లో ఉన్న భామ త్వరలో వివాహం చేసుకుంటానని తెలిపింది. తనకు రాజస్థానీ స్టైల్ వెడ్డింగ్స్ అంటే ఇష్టమని చెప్పిన అంకిత.. కానీ ఎలా ప్లాన్ చేస్తానో పక్కాగా చెప్పలేనంటోంది. ప్రేమకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్న ఆమె.. తను ఉన్న ప్రతీ చోటా ప్రేమ కావాలంటోంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. ప్రేమ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న అంకిత.. విక్కీతో పెళ్లి అనే మాటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉందనీ.. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పింది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..